‘నాట్య కళాచక్రవర్తి’ సప్పా దుర్గాప్రసాద్‌

0
51
రాజమహేంద్రవరం,  డిసెంబర్‌ 2 : నటరాజన్‌ నృత్యనికేతన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం కళారత్న హంస అవార్డును ప్రకటించింది. విజయవాడలో ఈ నెల 11న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘన సన్మానాన్ని ఆయన అందుకోనున్నారు. నాలుగవసారి ప్రభుత్వ అవార్డు పొందిన సప్పాకు హైదరాబాద్‌రకు చెందిన సివి రామన్‌ అకాడమీ ఈ ఏడాది 18 వార్షికోత్సవం సందర్భంగా సువర్ణ సింహా ఘంటా కంకణంతో పాటు నాట్య కళాచక్రవర్తి అనే బిరుదుతోనూ సన్మానించనున్నారు. ఈ సత్కారానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌, జలీల్‌ఖాన్‌, బోండా ఉమా, ఉప్పులేటి కల్పన, కోనా రఘుపతి, మల్లాది విష్ణు, ఎపిసిసి అధ్యక్షులు ఎం.వి. రఘు వీరారెడ్డి, ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే సప్పా మూడు సువర్ణ ఘంటా కంకణాలు, రెండు రజిత కిరీట సువర్ణాలు, సువర్ణ పుష్పాభిషేకాలు పొందారు. ఆలయ నృత్యం, యజ్ఞరత్నం పై ఆయన చేస్తున్న పరిశోధనలు, ప్రదర్శనలు విశ్వవ్యాప్తంగా కీర్తి పొందుతున్నాయి.