దుష్ప్రచారాన్ని నమ్మొద్దు….ఆందోళన వద్దు

0
170
పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం కొనుగోళ్ళపైనే దృష్టి
సిటీ ఎమ్మెల్మే ఆకుల సత్యనారాయణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : బంగారం పరిమితులపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, పెద్ద నోట్లను రద్దు చేసిన తేదీ నుంచి  బంగారం  కొనుగోళ్ళపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని సిటీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. స్ధానిక ప్రకాశం నగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.  మోడీ తీసుకునే చర్యల వల్ల రైతులకు, పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందుల రావని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల బంగారం కొనుగోళ్ళు జరిగాయని, వాటిపై మోడీ దృష్టి సారించారన్నారు. వారసత్వంగా వచ్చిన బంగారంపై లెక్కలు చెప్పాలని వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు బాసటగా నిలవాలన్నారు.  పెద్ద నోట్ల రద్దు వల్ల కొంతమంది బ్యాంక్‌ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అటువంటి ప్రయత్నాలను ఉద్యోగులు మానుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు నీరుకొండ వీరన్నచౌదరి పాల్గొన్నారు.