గుబ్బల రాంబాబుకు కీర్తి పురస్కారం

0
56
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 :  ప్రముఖ సామాజిక సేవకుడు, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు డా. గుబ్బల రాంబాబు  కీర్తి పురస్కారం – 2016కు ఎంపియకయ్యారు. ఫిలొంత్రఫిక్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఈ పురస్కారం అందజేయనుంది. ఈ నెల 5న అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కీర్తి పురస్కారాలను తెలుగు విశ్వ విద్యాలయంలో ఉదయం 11 గంటలకు అందజేయనున్నారు. గత 30 ఏళ్ళుగా నిరంతర సమాజ సేవలో నిమగ్నమైన రాంబాబుకు ఈ అవార్డు రావడం అభినందనీయమని స్వర్ణాంధ్ర సేవా సంస్థ అధ్యక్షులు రుంకాని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సీపిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు తుమ్మిడి అరుణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.