నిరుపేదలకు గృహాలు కల్పించండి

0
44
సబ్‌ కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వినతి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 5 :  స్థానిక 49వ డివిజన్‌ సుబ్బారావునగర్‌కు చెందిన 150 మంది నిరుపేద మహిళలకు ప్రధానమంత్రి యోజనా పథకంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలను కల్పించడానికి శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు కోరారు. ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆదిరెడ్డి చేతులమీదుగా 150 మంది మహిళలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ అంశంపై నగరపాలక సంస్థ కమిషనర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్‌ నాయకులు నెమలి శ్రీను పాల్గొన్నారు.