రాజమహేంద్రవరంలో ఏసీబీ కోర్టు

0
47
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 5 : రాజమహేంద్రవరంలో అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ )కోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సీఎస్‌ఎస్‌వీ దుర్గాప్రసాద్‌ జీవో కాపీని విడుదల చేశారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కోర్టులో హాజరు పర్చాలన్నా, కేసులను విచారించాలన్నా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళుతున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలో ఏసీబీ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. దీనిపై న్యాయవాదుల డిమాండ్‌ కూడా ఉంది.  మొత్తం మీద ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చి రాజమహేంద్రవరంలోనే ఏసీబీ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.