జాంపేట బ్యాంక్‌లో కొత్త లాకర్లు 

0
88
ప్రారంభించిన చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 5 : జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లో అధునాతన కొత్త లాకర్లను చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ ఈరోజు ప్రారంభించారు. ఇప్పటికే 125 లాకర్లు ఉండగా ఇప్పుడు కొత్తగా 116 లాకర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 241 లాకర్లు ఉన్నట్లు చైర్మన్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. బ్యాంక్‌ ఖాతాదారుల సూచనలు, సలహాల మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని మెరుగైన వసతులు సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ డైరెక్టర్లు జామిశెట్టి గాంధీ, ప్రసాదుల హరనాధ్‌, మహంతి లక్ష్మణరావు, సేపేని రమణమ్మ, ద్వారా పార్వతి సుందరి, ముప్పన శ్రీనివాస్‌, కాలెపు సత్యనారాయణమూర్తి, శీలా రఘుబాబు, కనకం అమర్‌నాధ్‌, కొమ్మన వెంకటేశ్వరరావు, రొబ్బి విజయశేఖర్‌, బ్యాంక్‌ ఇన్‌ఛార్జి సెక్రటరీ ఎన్‌.భరణీకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి లాకర్‌ను బ్యాంక్‌ ఖాతాదారులు జానా సుశీలకు చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ చేతులమీదుగా తాళాలు అందజేశారు.