డాక్టర్‌ స్వర్ణాంధ్ర రాంబాబుకు కీర్తి పురస్కారం

0
56
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 5 : ప్రభుత్వం పాటు ప్రజలకు సేవలందించడంలో స్వచ్ఛంద సేవా  సంస్థల పాత్ర ప్రాముఖ్యమైనది, శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. సోమవారం ఉదయం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ స్వచ్ఛం సేవా కార్యకర్తల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి యూనివర్సిటీ డీన్‌ డా|| ఎండ్లూరి సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురికి కీర్తి పురస్కారం అందించారు. రాజమండ్రి నగరంలో వృద్ధులు, అనాధలు, మహిళలు కోసం సేవలందిస్తున్న డాక్టర్‌ గుబ్బల రాంబాబు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. అలాగే సొంత సంస్థ భవాని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు స్వర్ణాంధ్ర రాంబాబు సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా రాంబాబును దుశ్శాలువాతో సత్కరించి, కీర్తి పురస్కారాన్ని ఆదిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఫ్రాన్సిస్‌, బొమ్మూరు మాజీ సర్పంచ్‌ ఎం. శంభోజిరావు, రూరల్‌ తెదేపా అధ్యక్షులు మార్ని వాసుదేవరావు, మత్సేటి శివసత్యప్రసాద్‌ అవార్డు అందుకున్న వారిలో ఊబలంకకు చెందిన అన్నా మినిస్ట్రీస్‌ అధినేత ఐఇ కుమార్‌, వై. విజయసాయికుమార్‌ (అనంతపురం), ఇంటి యేసుపాదం (ఆకువీడు), ఎం. సత్యనారాయణ(కాకినాడ), ఎం. కృపారావు( అనంతపురం), చెరుకువాడ రంగసాయి (బీమవరం), శ్రీనివాస వర్మ (కొవ్వూరు), పి. చక్రవర్తి, తదితరులు కీర్తిపురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఫిలాంతపిక్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.  అద్దంకి రాజయోన, పుట్ట హేమలత, వై. శశికళ, శ్రీనివాస్‌, గుత్తుల అంజి, దుర్గాదేవి, విజయలక్ష్మి, బత్తుల భరణి తదితరులు పర్యవేక్షించారు.