రాజమహేంద్రవరంతో అమ్మకు అనుబంధం

0
77
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 6 : అసువులు బాసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది.  సిద్ధాంతుల పట్ల గౌరవాభిమానాలు, భవిష్యత్‌ దర్శిని గురించి అపారమైన విశ్వాసం కలిగిన ఆమె 1988లో ఏఐఎండిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాజమహేంద్రవరం వచ్చారు. నగరంలోని తుమ్మలావలో ఆగమసమ్రాట్‌గా పేరొందిన బోనుమద్ధి రామలింగ సిద్ధాంతి స్వగృహానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆశీస్సులు పొందారు. రామలింగ సిద్ధాంతి స్ధానిక వై జంక్షనలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ ఆ విగ్రహం వద్ద ఉన్న శిలా ఫలకంపై  జయలలిత పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది.