అంబేద్కర్‌ ఆశయాలను సాధించాలి

0
64
వర్థంతి సభలో పలువురు వక్తల పిలుపు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 6 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఈరోజు గోకవరం బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల సంక్షేమానికి, సమానత్వానికి అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. దళిత ఐక్య వేదిక చైర్మన్‌ పిల్లి వెంకట రమేష్‌ ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం అనాధ బాలలకు అల్పాహార వితరణ చేశారు. బి.సి. వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఎం.పి.డి. కృపావరం చేతులమీదుగా అల్పాహారం పంపిణీ చేశారు. సంజీవయ్య నగర్‌లో అజ్జరపు వాసు ఆధ్వర్యాన వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, మట్టాడి చిన్ని, అర్ధాల కుమార్‌, నక్కా వెంకటరత్నం, పాము బాబూరావు, కప్పల వెలుగుకుమారి, జాలా మదన్‌, పచ్చిమళ్ళ రవిప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవరావు, గారా త్రినాధ్‌, పి.కుమార్‌, ఎల్‌.వి.ప్రసాద్‌, మాలే వెంకటేశ్వరరావు, అనంతప్రసాద్‌ తదితరులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.