‘ఆదరణ’ అభినందనీయం : ఆదిరెడ్డి వాసు

0
100
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 10 : ఎయిడ్స్‌ బారిన పడి మరణించిన వారి పిల్లలను ఆదుకునేందుకు రాజమండ్రి రూరల్‌, కాతేరులో ‘ఆదరణ’ ఎయిడ్స్‌ ఆనాధ పిల్లల ఆశ్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు అన్నారు. ఎయిడ్స్‌ బారిన పడిన వారు మరణిస్తే వారి పిల్లలు ఆనాధలుగా మిగిలిపోతే రోడ్డున పడుతున్నారని అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చి, ఆహారం పెట్టి, వైద్యం అందించి, వారికి జీవితం పట్ల ఒక ఆశ కల్పించడానికి ఈ సంస్ధ చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. సవాల్‌తో కూడిన సేవా కార్యక్రమానికి తమ అండదండులు, సహకారం నిత్యం ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం పిల్లలు విశ్రాంతి తీసుకునే విశ్రాంతి గదిని రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. పిల్లలకు అవసరమయ్యే వైద్యం, మందులు ఉచితంగా అందిస్తానని డాక్టర్‌ చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. సిక్‌రూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి రమేష్‌కిషోర్‌, డాక్టర్‌ సిహెచ్‌వి సునీత, డాక్టర్‌ జెవిఎల్‌ఎం పద్మశ్రీ, డాక్టర్‌ టి రమణనాయక్‌, డాక్టర్‌ ఎం పవన్‌కుమార్‌, డాక్టర్‌ కెవి రమణ, ఏఆర్‌టి సెంటర్‌ డాక్టర్‌లు, సిబ్బంది సి.ఎన్‌.పి ప్లస్‌ పిడి, స్టాఫ్‌, వీహన్‌ స్టాఫ్‌ సన్యాసిరావు, కొయ్యల రమణ, ధన, ఎం అరుణ్‌, పాస్టర్‌ జోషఫ్‌, పాస్టర్‌ జాషువాబాబులు పాల్గొని సంస్ధకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 150 మంది వ్యాధి గ్రస్తులైన పిల్లలు, వారి కుటుంబ సభ్యులకు ఆదరణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలతో ఆటలు ఆడించి, పౌష్టికాహార కిట్లు, దుప్పట్లు బహుకరించారు. ఈ సంస్ధ అధినేత ఎజ్రా రాజ్‌ మాట్లాడుతూ ఈ ఆశ్రమము వివరాలకు కొరకు 809997709 నెంబర్‌ నందు సంప్రదించవచ్చని తెలిపారు. ఆశ్రమం నడిపించడానికి టి రాజేంద్రప్రసాద్‌, రాజా రవికుమార్‌, శ్యామ్‌, యేసయ్య ఆదరణ చర్చ్‌ మెంబర్స్‌, సుబ్బారావు పేటలోని అంబేద్కర్‌ యూత్‌ బాగా శ్రమించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.