కెనడీకి కన్నీటి వీడ్కోలు 

0
69
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 10 : అభిమానుల, బంధుమిత్రుల అశ్రుపూరిత నయనాల మధ్య ప్రఖ్యాత చిత్రకారుడు గువ్వల కెనడీ అంత్యక్రియలు  ఈరోజు జరిగాయి. నిన్న హఠాన్మరణం చెందిన కెనడీ భౌతికకాయాన్ని నందం గనిరాజు సెంటర్‌ సమీపాన ఉన్న ఆయన నివాసంలో ఉంచగా పలువురు నగర ప్రముఖుల, అభిమానుల, బంధుమిత్రుల నివాళుల అనంతరం ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు. కోటిలింగాలపేట రోటరీ కైలాస భూమి వరకు జరిగిన అంతిమయాత్రలో పలువురు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. చిన్న వయస్సులోనే అమరుడై తన కళ ద్వారా అందరి హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న కెనడీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు కంట తడిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, సీసీసీ చానల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు, పలు పార్టీల నాయకులు జక్కంపూడి  విజయలక్ష్మీ, బర్రే కొండబాబు, ప్రసాదుల హరినాథ్‌, బుడ్డిగ రాధ, మహంతి లక్ష్మణరావు, గెడ్డం రమణ, కడితి జోగారావు, నక్కా రాజబాబు, నందం కుమార్‌ రాజా, బొంత శ్రీహరి, తలారి భగవాన్‌, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్‌,  చవ్వాకుల ప్రకాశరావు, వాగర్ధలహరి కోమలి రాంప్రసాద్‌ తదితరులు నివాళులు అర్పించారు. అలాగే చిత్రకారులు సాకే సంజీవరావు, గొర్రిపాటి తాతారావు, తారా నగేష్‌, బుద్దా చౌదరి, బుద్ధా బాబూరావు, బుద్ధా సూర్య నాగేశ్వరరావు, కె.రామా రమేష్‌, కోళ్ల వెంకటరమణ, కె.నూకరాజు, డి .నాగేశ్వరరావు, చెక్కా సత్యం, నందా ఆర్ట్స్‌ సూరిబాబు, అరుణ్‌ ఆర్ట్స్‌ రమేష్‌, రమేష్‌ (వేమగిరి), ఆనంద్‌ ఆర్ట్స్‌ నిర్వాహకులు, వానపల్లి, ఆర్టిస్ట్‌ దుర్గారావు, గణేష్‌, సంతోష్‌, కె బాలయోగి, పి.శ్రీధర్‌ పాల్గొని నివాళులర్పించారు.