మోడీ నిర్ణయాలకు ప్రజల హర్షం

0
67

రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 12 : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవినీతిరహిత భారత నిర్మాణానికి చేస్తున్న కృషికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ అన్నారు. సుమాస్‌ సిల్వర్స్‌ అధినేత, జెఏసి మెంబర్‌ బలభద్ర సుమలత, ఆమెతో పాటుగా 30 మంది మహిళలు ఈరోజు పార్టీ సభ్యత్వం స్వీకరించి బిజెపిలో చేరారు. వీరిని ఎమ్మెల్యే ఆకుల స్వాగతించి పార్టీ కండువాలు వేశారు. అనంతరం ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో మహిళాభ్యుదయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని పరిపాలన చేస్తున్నారన్నారు. పార్టీలో చేరిన మహిళలు నగర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళామోర్చా కార్యదర్శి నాళం పద్మశ్రీ, పెదిరెడ్డి రాజేశ్వరి, అడ్డాల ఆదినారాయణ, తంగెళ్ళ రాజ్యలక్ష్మి, జి.కుమారి, ఎం.రాజేశ్వరి, ఎ.భవాని, మాధవరపు శ్రీనివాసనాయుడు, పండు తదితరులు పాల్గొన్నారు.