ఆరోపణలు నమ్మకండి…వాస్తవాలు చూడండి:ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

0
119
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 14 : బాబు వచ్చారు…జాబులు పోయాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను యువత  నమ్మరాదని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఆర్ట్సు కళాశాల, ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళాకు సంబంధించిన సన్నాహక శిక్షణా శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ముచ్చటించారు. తాను లెక్చరర్‌గా పనిచేశానని, విద్యార్ధులు శ్రద్ధతో జాబ్‌ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.  రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తూ పె ట్టబడిదారులను ఆహ్వానిస్తున్నారని, ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలవడం ఖాయమన్నారు. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగడం,  ఖాళీల కోసం ఎన్నో వ్యయప్రయసలకోర్చే అవకాశం లేకుండా ఒకే చోట ప్రముఖ సంస్థలను రాజమహేంద్రవరానికి రప్పించి ఆరు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎమ్మెల్యే గోరంట్ల మంచి ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిని ్న జాబ్‌ మేళాలను నిర్వహిస్తామని, ఎంపిక కాని వారు నిరాశ చె ందనవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, ఇన్నీస్‌పేట బ్యాంక్‌ డైరక్టర్‌ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.