జర్నలిస్టు ఆచంట నటరాజ్‌ మృతికి ఆర్‌పిసి సంతాపం 

0
133
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : సీనియర్‌ జర్నలిస్టు ఆచంట నటరాజ్‌ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. గత 30 ఏళ్ళుగా జర్నలిజం వృత్తికి అంకితభావంతో సేవలందించిన నటరాజన్‌ ప్రజా ఉపయోగకర వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. నటరాజ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని, ఈ దిశగా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ నుండి తీర్మానం చేసి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియపరచాలని మేడా కోరారు.ఈ కార్యక్రమంలో  ఆర్‌పిసి సెక్యులర్స్‌ డి.వి.రమణమూర్తి, పెండ్యాల కామరాజు, భూసిం వై.వి.సత్యనారాయణ, దుడ్డె త్రినాథ్‌, పొట్నూరి అప్పలస్వామి, ఆర్‌.కె.చెట్టి, లంక దుర్గాప్రసాద్‌, కరుటూరి శ్రీదేవి, మడకం బాపయ్య, సూర్యదేవర బాలు, అమర్నికం రాజేశ్వరరావు, మేడిచర్ల శ్రీనివాస్‌, లోలుగు తమ్మయ్య, బూణం అప్పారావు, కోటంశెట్టి ప్రకాష్‌  పాల్గొని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.