18న ఆంధ్రప్రదేశ్‌ ఈస్ట్‌ జోనల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలు

0
48
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : ఈనెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిడదవోలు ఎ.బి.ఎస్‌.టౌన్‌హాలులో ఆంధ్రప్రదేశ్‌ ఈస్ట్‌ జోనల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.  ఈ పోటీలు ఏడు విభాగములలో జరుగుతాయి. ఏడు విభాగములలో 1, 2, 3 స్థానాలకు నగదు మరియు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేస్తారు. చాంపియన్‌ ఆఫ్‌ ది చాంపియన్స్‌ అయిన వారికి 10వేల రూపాయల నగదు అందజేస్తారు. ఈ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బాడీ బిల్డర్స్‌ అందరూ తప్పక పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 98495 79603 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.