నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో రాజమహేంద్రి విద్యార్ధినులకు బహుమతులు

0
72
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : నగరంలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల పోటీల్లో రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినులు పలు బహుమతులు గెల్చుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ డా. నాళం రజనీ తెలిపారు. డ్రాయింగ్‌ పోటీల్లో ఎస్‌.స్నేహ సుధామయి అనే సీనియర్‌ ఇంటర్‌ విద్యార్ధిని రూ. 5  వేలు నగదు బహుమతి, జస్ట్‌ ఏ మినిట్‌ పోటీల్లో ఎండి. నఫీజ తృతీయ బహుమతి సాధించింది. వీరిని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపాల్‌ రజనీ అభినందించారు.