స్వచ్ఛంద సేవకులకు స్వర్ణాంధ్ర శిక్షణ

0
40
రాజమహేంద్రవరం, డిసెంబర్‌  15 : స్వర్ణాంధ్ర వలంటీర్‌ ఇంటర్నెషిప్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికి సుమారు 500మందికి శిక్షణ ఇచ్చినట్టు స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు తెలిపారు. గురువారం ఉదయం నన్నయ యూనివర్సిటీ ఎంఎ సోషల్‌ వర్క్‌ చదువుతున్న విద్యార్ధులకు ప్రాజెక్ట్‌ వర్క్‌ నిమిత్తం నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు వారికి ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ కోర్సులు చదువుతున్న అనేక మంది విద్యార్ధినీ విద్యార్ధులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర చేపట్టే ఉచిత వైద్య సేవా శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ ద్వారా రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి స్వచ్ఛంద సేవా గుర్తింపు పత్రాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిపిరెడ్డి భరణి, వై. శశికళ, దేవి తదితరులు పాల్గొన్నారు.