ఎపిఇఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి వర్థంతి 

0
44
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 16 : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్‌ సొసైటీ (రి) అధ్యక్షులు వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం (బాబ్జి) ఆధ్వర్యంలో కార్యదర్శి పందిరి వీరభద్రస్వామి పర్యవేక్షణలో 64వ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా రాజమండ్రి డీలక్స్‌ సెంటర్‌, కోటగుమ్మం వద్ద అమరజీవి విగ్రహాలకు వందన కార్యక్రమం జరిగింది. అనంతరం అధ్యక్షులు వెత్సా బాబ్జి మాట్లాడుతూ అమరజీవి జయంతి వర్థంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం రాష్ట్రపితగా భావించే అమరజీవి పొట్టి శ్రీరాములుగా అవమానం జరుగుతున్నట్లుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి 58 రోజులు కఠోర నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవికి భారతరత్న బిరుదు ప్రదానం కేంద్ర ప్రభుత్వం చేయాలని, అలాగే పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని గుర్తించి నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం పాదచారులకు మారడగుల సుబ్బయ్య సౌజన్యంతో డీలక్స్‌ సెంటర్‌లో బ్రెడ్‌, బిస్కట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యదర్శి పందిరి స్వామి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కాకి ప్రసాద్‌, అప్పన కృష్ణ, మరియాల కృష్ణ, ఎం.ప్రసాద్‌, కొంపర ఆనంద్‌, ఎం.శ్యామ్‌, కె.సూర్యనారాయణ, కూర్మదాసు ప్రభాకరరావు, వాసవీ క్లబ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కార్యవర్గం పాల్గొన్నారు.