రెల్లి ఉప కులాలకు  ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

0
81
కార్యవర్గ సమావేశంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం డిమాండ్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 18 :  ప్రభుత్వ రంగాలకు సంబంధించి విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన రెల్లి ఉప కులాలకు సమాన నిష్పత్తిలో అధికార కేంద్రీకరణ జరిపించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న నగర పాలక సంస్థ కల్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిధిగా నీలాపు వెంకటేశ్వరరావుతో పాటు ఏపీ పంచాయితీరాజ్‌ పరిషత్‌  అధ్యక్షులు చాన్‌భాషా, సంఘ మాజీ అధ్యక్షులు డా. ఆడమ్స్‌, ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, బొచ్చా నర్సింహమూర్తి, బంగారు సత్యం అప్పారావు, వడ్డాది సింహాచలం, అల్లం పోలయ్య, ముత్యాల రాము, మీసాల ఆదినారాయణవర్మ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెల్లి  ఉప కులాలకు ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, లిపి లేని భాష కలిగిన రెల్లీలను ఎస్టీ జాబితలో చేర్చాలని కోరారు. రెల్లీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఉషా మెహ్రా కమిషన్‌ నివేదికను అనుసరించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ల్లో  రెల్లీలకు అవకాశం కల్పించాలని, సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి రెల్లీ కులాలకు సహాయం అందించాలన్నారు. మండల, పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెల్లి పారివుద్ధ్య కారి ్మకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రెల్లి కుటుంబాలకు భూమి కొనుగోలు పథకాన్ని  ఏర్పాటు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో  ముత్యాల వెంకటేశ్వర్లు,  బంగారు తాతారావు, బంగారు నాగేశ్వరరావు, బంగారు వీరవెంకటరమణ, కిలారి శ్రీను, సుబ్బాయమ్మ, మీసాల నాగరాజు, ముత్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.