నెలకు రూ. 5  వేల వేతనం చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ధర్నా 

0
37
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : ఆశా వర్కర్‌లకు గౌరవ వేతనం కాకుండా నెలకు రూ.5వేలు వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్ధానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నేడు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. . ఎన్‌హెచ్‌ఎంకు 2017-18 బడ్జెట్‌లో నిధులు పెంచాలని, తక్షణమే నెలకు రూ.5వేలు వేతనం ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలని, పారితోషిక బకాయిలు, ఏజెన్సీ ఆశాల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, పని భద్రత, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, పిహెచ్‌సిలలో మంచినీరు, మరుగుదొడ్డి, సమావేశపు గది, విశ్రాంతి గది వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని, పిహెచ్‌సిలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, ఖాళీలు భర్తీ చేయాలని, 104 బకాయిలు చెల్లించాలని, పారితోషికం రూ.300కు పెంచాలని, 4 సంవత్సరాల యూనిఫారం, అలవెన్స్‌ వెంటనే చెల్లించాలని, జిల్లాలో ప్రతి రెండు నెలలకొకసారి జాయింట్‌ మీటింగ్‌ నిర్వహించాలని, ప్రతినెలా ఆశావర్కర్స్‌ పర్ఫార్మెన్స్‌ రిపోర్టు నోటీసు బోర్డులో పెట్టాలని, అర్హులైన వారికి ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలని, ఇప్పటికే శిక్షణ పొందిన వారిని 2వ ఏఎన్‌ఎంగా తీసుకోవాలని తదితర డిమాండ్‌లతో ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌వి మోహన్‌, ఎన్‌ రంగ, రవి, ఐద్వా జిల్లా నాయకులు టి సావిత్రి, కార్యదర్శి తులసి, సిఐటియు నాయకులు బిబి నాయుడు రాజులోవ, భీమేశ్వరరావు, సుహ్మ్రణ్యం, రామకృష్ణ సందర్శించారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె అన్నామణి, టి నాగమణి, బి లక్ష్మికుమారి, ఎం హవేలాకుమారి, పోసమ్మ, మంగ, వెంకటలక్ష్మి  పాల్గొన్నారు.