రూరల్‌లో అభివృద్ధి పనులకు రాజప్ప శంకుస్థాపన

0
52
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : రూరల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఈరోజు శంకుస్థాపన చేశారు. బొమ్మూరులోని ఝాన్సీ లక్ష్మీభాయ్‌ నగర్‌లో రూ. కోటి 30 లక్షలతో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి, కాతేరులో రూ. 1.40 కోట్లతో మూడు సీసీ రోడ్ల నిర్మాణానికి, తొర్రేడులో రూ. 15 లక్షలతో గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి రాజప్ప శంకుస్థాపన చేశారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తెదేపా అధికారం చేపట్టాక నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మురళిమోహన్‌, ఎమ్మెల్యే గోరంట్ల, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, తహసీల్ధార్‌ భీమారావు, ఎండీఓ రమణారెడ్డి, రూరల్‌ నేతలు గంగిన హనుమంతరావు, కామిని ప్రసాద్‌చౌదరి,మత్సేటి ప్రసాద్‌, ఆళ్ళ ఆనందరావు పాల్గొన్నారు.