రోడ్డుపైనే బోధన 

0
69
ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వినూత్న నిరసన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈరోజు కోటిపల్లి బస్టాండ్‌ వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపైనే విద్యార్ధులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, పదవ పిఆర్‌సి సిఫార్సు మేరకు బేసిక్‌, డిఏ చెల్లించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలలను పరిరక్షించాలని కోరారు.