ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

0
97
చంద్రబాబుపై జక్కంపూడి రాజా విమర్శలు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబునాయుడు తాకట్టుపెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విమర్శించారు. విజయనగరంలో ఇటీవల జరిగిన యువ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా కావాలంటే జగన్‌ సీఎం కావాలని, 2019 ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసేందుకు యువజన, విద్యార్ధి విభాగాలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.  ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బంగారు నాయుడు, రంగారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.