తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ‘తానా’ సేవా కార్యక్రమాలు

0
108
గన్ని కృష్ణ నివాసంలో తానా 2017 అధ్యక్షుడు సతీష్‌ వేమన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 21 :  తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని  సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తానా 2017  అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సతీష్‌ ఈరోజు శ్రీరామనగర్‌లోని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ  నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ 2017 మే 28 నాటికి తానా స్థాపించి 40 వసంతాలు పూర్తవుతాయని, ఈ సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా జులైలో ఉత్సవాలు నిర్వహించేవారమని, వచ్చే ఏడాది మే 28నే చేపడుతున్నట్లు తెలిపారు. తెదేపా నేత గన్ని కృష్ణను తానా ఉత్సవాలకు  ఆహ్వానించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.  సతీష్‌ వేమనతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు వీరభద్రం చౌదరి తదితరులు ఉన్నారు.