ఎనీటైం మనీ ఉండేలా చూడాలి

0
65
సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 22 : అన్ని ఎటిఎంలలో తగినంత నగదును ఉంచాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ నగర సమితి తరపున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రాజమండ్రి బ్రాంచి వద్ద ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 8వ తేదీన రూ.1000, 500ల నోట్లను రద్దు చేస్తూ దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని నల్ల కుబేరుల వద్ద నుండి పెద్ద మొత్తంలో వెలికి తీస్తామని ప్రకటించి రూ.2వేల నోటు ముద్రించడం ద్వారా బ్లాక్‌ మనీదారులు అందరూ కూడా మార్చుకోవడానికి అవకాలం కల్పించి వారికి రాయితీలు ఇస్తూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. అన్ని ఎటిఎంలలో డబ్బు పెట్టకుండా రోజులు తరబడి ఎటిఎంల వద్ద బ్యాంకులు దగ్గర పడిగాపులు గాస్తూ 20 మందికి పైగా మరణించడం విచారించదగ్గ విషయమన్నారు. మోడీ తుగ్లక్‌ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుబడటమే కాకుండా చెడు వ్యాపారులు, కార్మికులు, రైతులు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. 43 రోజులుగా మోడీ చేసిన తుగ్లక్‌ చర్యల వలన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజల యొక్క నగదు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, నల్ల కుబేరులను శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాపిత పిలుపులో భాగంలో రాజమహేంద్రవరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాజమండ్రి సహాయ కార్యదర్శి ఎస్‌.లత్సాలు, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మీసాల సత్యనారాయణ, కిర్ల కృష్ణ, మహిళా సమాఖ్య అద్యక్షురాలు నల్ల భ్రమరాంబ, నగర అధ్యక్షులు ఎస్‌.నాగమణి, సేపేని రమణమ్మ, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు వంగమూడి కొండలరావు, వి.రాంబాబు, కె.శ్రీనివాసరావు, సిపిఐ నగర కమిటీ సభ్యులు నౌరోజి, పామర్తి సూర్యప్రకాశరావు, ఇంటర్నేషనల్‌ పేపరుమిల్లు ఎఐటియుసి నాయకులు ఎం.వీరభద్రరావు, బేగం, నల్లా కుమారి, పల్లికొండ ఈశ్వరరావు పాల్గొన్నారు.