ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి 

0
77
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 23 : ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడు మహ్మద్‌ జాఫర్‌ షాజిద్‌ రెండు కిడ్నీలు పాడవడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని, అతని చికిత్సకు ఆర్థిక సాయం అందించాలని తండ్రి మహ్మద్‌ ఇబ్రహీం దాతలకు విజ్ఞప్తిచేశారు. రఘుదేవపురానికి చెందిన జాఫర్‌షాజిద్‌ దివాన్‌చెరువు ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ చదువుతున్నాడు. ఇటీవల అతని రెండు కిడ్నీలు దెబ్బతినడంతో ఆపరేషన్‌ చేసి, కిడ్నీ అమర్చాలని వైద్యులు తెలియచేయడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. ఆటో నడిపి జీవనాధారం పొందుతున్న మహ్మద్‌ ఇబ్రహీం తనకుమారుడిని బతికించుకునేందుకు దాతలను అర్థిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ఆపరేషన్‌తోపాటు అదనంగా మందులఖర్చు ఎక్కువగా ఉండటంతో తమకు ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. తమకు సాయం చేసే దాతలు స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా (ఐఎఫ్‌సి 15366) 34524807267 అకౌంట్‌నెంబర్‌లో వేయాలని కోరారు. ఇతర వివరాలకు 8096004871 (ఇబ్రహీం), 7013760733 (సాయి) సంప్రదించి తమకు ఆదుకోవాలని ఇబ్రహీం విజ్ఞప్తిచేశారు.