పేదల జీవితాలలో క్రిస్మస్‌ వెలుగులు

0
68
క్వారీ మార్కెట్‌ కూడలిలో ‘వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ వస్త్రాల పంపిణీ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 23 : పేదల జీవితాలలో క్రిస్మస్‌ వెలుగులు నింపేందుకు వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ ద్వారా వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. సబ్‌ కలెక్టర్‌ సూచన మేరకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ, జెసిఐ రాజమండ్రి, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థల ద్వారా క్వారీ మార్కెట్‌ ఏరియాలో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని పాత వస్త్రాలను సేకరించి వాటిని పేదలకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగానే స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు పాత వస్త్రాలను, కొత్త వస్త్రాలను సేకరించారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యాలయంలో పాత బట్టలను శుభ్రం చేసి, చినిగిన వాటిని కుట్టించి, వాటిని ఇస్త్రీ చేయించి, కవర్‌ ప్యాకింగ్‌ చేయించారు. స్వర్ణాంధ్రలోని కుట్టు శిక్షణా విభాగానికి చెందిన మహిళలు కొద్దిరోజులుగా ఈ విషయంలో శ్రమించి  కార్యక్రమం విజయవంతానికి కృషిచేశారు. ఈరోజు క్వారీ సెంటర్‌లో ప్రారంభించిన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తెదేపా నేత గన్ని కృష్ణ పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఎంతో బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గుబ్బల రాంబాబును అభినందించారు. ఆయనకు సహకరిస్తున్న జెసిఐ రాజమండ్రి శాఖ అధ్యక్షులు కోరుకొండ శ్రీరామ్‌కిషోర్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌ జైన్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ తహశీల్దార్‌ పోసియ్య, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బర్రే కొండబాబు, మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు భరణి, సుధాకర్‌, దుర్గాదేవి, పండరీనాధ్‌, రమణ, సుమ నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.