మానుకొండ పుష్ప మృతికి దుర్గేష్‌ సంతాపం

0
63
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 24 : ఇటీవల మృతి చెందిన కాతేరులోని వైఎస్సార్‌సిపి సభ్యురాలు మాజీ వార్డు మెంబరు మానుకొండ పుష్ప మృతికి మాజీ ఎంఎల్‌సి కందుల దుర్గేష్‌ సంతాపం తెలియజేశారు. అలాగే మాజీ సర్పంచ్‌ ఆచంట సుబ్బారాయుడు, ఎడ్డి వాసు, ఆచంట కళ్యాణ్‌, కొత్తపల్లి నాగేశ్వరరావు, కాతేరు జైభీమ్‌ అధ్యక్షులు పోలిపాటి చంద్రశేఖర్‌, కాతేరు ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు రత్నరాజు, మేకా సూర్యారావు, పార్టీ కార్యకర్తలు మానుకొండ పుష్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పుష్ప మృతికి సంతాపం తెలియజేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.