యేసే ఈ లోకానికి మార్గం 

0
54
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 24 :  యేసే ఈ లోకానికి మార్గం, చీకటి అనే పాపంలో వున్న వారిని వెలుగులోకి నడిపించే రక్షకుడు అని రెవ.డేనియల్‌ విల్సన్‌ అన్నారు.స్థానిక 13వ వార్డు ఏసివై కాలనీలో బెతస్థ ప్రార్థనా మందిరం సంఘకాపరి రెవ.ఎమ్‌.ఎన్‌.సుధాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన సభకు పాష్టర్‌ అరవింద్‌ అధ్యక్షత వహించారు.రెవ.నరేష్‌,రెవ.సాల్మన్‌రాజు తదితరులు ప్రసంగించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు కార్పొరేటర్‌ పాలిక శ్రీను,సంఘకాపరి ఆశీర్వాదంలు పేద మహిళలకు చీరలు పంపీణి చేసారు.సంఘ అభివృద్ధికి సహకరిస్తున్న కార్పొరేటర్‌ పాలిక శ్రీనును సంఘం తరుపున ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సంఘస్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.