లయన్స్‌ సంస్కృతి సేవలు ఆదర్శప్రాయం

0
61
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 24 : లయన్స్‌ క్లబ్‌ సంస్కృతి, హెల్త్‌ హాస్పటల్స్‌ సంయుక్తంగా స్థానిక శాటిలైట్‌ సిటీలో ఈరోజు మెగా ఉచిత హృద్రోగ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, పిల్లి సుబ్రహ్మణ్యం, తెదేపా యువనేత  ఆదిరెడ్డి వాసు, లయన్స్‌ రీజనల్‌ చైర్‌పర్సన్‌ కొల్లూరి గోపాలకృష్ణ, ఎస్‌.వి.వి.సత్యనారాయణ పాల్గొన్నారు. సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. చికిత్స అవసరమైన వారికి హెల్త్‌ హాస్పటల్‌ విజయవాడలో చేస్తారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి అధ్యక్షులు బొండాడ ప్రభాత్‌, కార్యదర్శి తాటిపాక శ్రీనివాసరావు, కోశాధికారి జి.ఎస్‌.చక్రవర్తితోపాటు బొప్పన కృష్ణమూర్తి, గోకుల మురళి, మాటూరి సిద్ధార్ధ, కటికి లీలాకృష్ణ, నాళం శివరామకృష్ణ, యిన్నమూరి దీపు, మార్ని దొరబాబు,  తదితరులు పాల్గొన్నారు.