వంగవీటి రంగాకు నివాళి

0
67
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : దివంగత వంగవీటి రంగా చిరస్మరణీయుడని, ధైర్యసాహసాలకు చిరునామాగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. రంగా వర్థంతి సందర్భంగా స్థానిక ట్రైనింగ్‌ కాలేజి సెంటర్‌లో రంగా మిత్ర మండలి ఆధ్వర్యాన వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగా విగ్రహానికి సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, జిల్లా వర్తక ఫెడరేషన్‌ చైర్మన్‌ మండెల శ్రీనివాస్‌, వడ్డి మురళి, ఇసుకపల్లి శ్రీనివాస్‌, అల్లూరి శేషునారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో గోలి రవి, సందీప్‌, ముద్దాల అను తదితరులతో పాటు నగర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు.