దళిత క్రైస్తవులకు త్వరలో ఎస్సీ హోదా 

0
39
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.పేద క్రైస్తవులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నగరంలో దహించు అగ్ని మినిస్ట్రీస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్రైస్తవుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాయితీపై రుణాలు అందజేస్తామన్నారు. జెరూసలేం యాత్రకు వెళ్ళే వారికి సీఎం చంద్రబాబు నాయుడు పలు రాయితీలు ప్రకటించారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో క్రైస్తవులకు అనేక వరాలు ప్రకటించారని తెలిపారు. అనంతరం  పేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు  ఆర్ధిక సహాయంతో పాటు వస్త్రాలను మంత్రి పంపిణీ చేశారు. దహించు అగ్ని మినిస్ట్రీస్‌ అధినేత థామస్‌ మాట్లాడుతూ  వికలాంగులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా క్రీస్తు జననానికి సంబంధించిన ప్రత్యేక గీతాలు, నృత్యాలు ఆలపించారు. షీభా థామస్‌, జయశృలన్‌, ఫాదర్‌ రాజ్‌కుమార్‌, యాకోబ్‌, తెదేపా కార్పొరేటర్‌ కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, పైడిమళ్ళ మెర్సీప్రియ తదితరులు పాల్గొన్నారు.