పేపర్‌మిల్లు టిఎన్‌టియుసి అనుబంధ కార్మిక సంఘ కార్యవర్గం 

0
64
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : ఏపీ పేపర్‌మిల్లులోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టిఎన్‌టియుసి కార్మిక సంఘం నూతన అధ్యక్షులుగా చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, ప్రధాన కార్యదర్శిగా పిల్లా వీరబాబులను ఎంపిక చేస్తూ రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ  కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. మిల్లు కార్మికులకు యూనియన్‌ అందుబాటులో ఉండాలన్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నివాసానికి వచ్చి తమను నియమించినందుకు గోరంట్లకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పరిమి శ్రీనివాస్‌, దేవిన సోమశేఖర్‌ తదితరులు ఉన్నారు.