ఆదిత్య విద్యార్ధులకు బహుమతుల పంట 

0
35
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల వారు నిర్వహించిన ”ప్రోవెస్‌ 2కె-16” పోటీలలో రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్ధులకు బహుమతులు లభించాయని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి తెలిపారు. కాగ్నిజెన్స్‌ పోటీలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఫైనల్‌ బి.ఎస్‌.సి. విద్యార్ధిని ఆర్‌.విజయశ్రీ మొదటి బహుమతిని, ఎన్‌.రోహిణి ద్వితీయ బహుమతిని సాధించగా క్విజ్‌ పోటీలో టి.గౌతమి, ఆర్‌.శ్రీలక్ష్మి, పి.స్వాతిల బృందం ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారని ఇన్‌ఫోక్విస్ట్‌ పోటీలో ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఫైనల్‌ ఇయర్‌ బిసిఏ విద్యార్ధి టి.అజయ్‌కుమార్‌ ద్వితీయ బహుమతిని, క్విజ్‌ పోటీలో కృష్ణవంశీ, ఎం.ఎస్‌.ఆర్‌.కె.సుబ్రహ్మణ్యంల బృందం ద్వితీయ బహుమతిని గెలుపొందారని ఆదిత్య డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కె.సి.సాగర్‌, సి.ఫణికుమార్‌లు తెలిపారు. విజేతలను ఆదిత్య డిగ్రీ కళాశాలల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, సెక్రటరీ ఎన్‌.కె.దీపక్‌రెడ్డి, డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.