31వ డివిజన్‌లో బిజెపిలో చేరికలు 

0
45
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : భారతీయ జనతాపార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీల నిర్మాణంలో భాగంగా 31వ డివిజన్‌కు చెందిన 171, 172, 173, 177 నెంబర్లు పోలింగ్‌ బూత్‌లకు పోలింగ్‌ మెంబర్లను ఏర్పాటు చేసి వారితో స్థానిక డివిజన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. వలిరెడ్డి పాప, కొండపల్లి సత్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ములదత్తు, ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణారావు, బూర రామచంద్రరావు, పైలా సుబ్బారావులు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 31వ డివిజన్‌కు చెందిన 50 మంది పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా బొమ్ములదత్తు మాట్లాడుతూ నరేంద్రమోడీ నిస్వార్థంగా, అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా దేశంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం మాత్రమే పనిచేస్తున్నారని, అటువంటి నాయకుడు మన దేశ ప్రధానిగా ఉండటం హర్షించదగిన విషయమన్నారు. పార్టీలో చేరి బూత్‌ కమిటీ సభ్యులుగా నియమించబడిన వారిలో సరిపల్లి శ్యామల, తంగేటి వీరమణి, పగడాల సీతామహాలక్ష్మి, రొంగల లీలావతి, కోరెడ్డి హైమావతి, శీలం లక్ష్మి,  ఎం.శ్రీదేవి, నంద సత్య, పేరుపోయిన చిన్నారి, కొండపల్లి అజయ్‌, దూబర మణమ్మ, వలిరెడ్డి ధనలక్ష్మి, కోరాడ సుబ్బలక్ష్మి, పుచ్చల నందిని, పత్తి రాజ్యం, కోరెడ్డి దేవి ప్రసన్న, గులిపల్లి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.