సమాజ సేవలో మరింత ముందుండాలి

0
88
స్వచ్ఛంద సంస్థలకు గోరంట్ల, గన్ని పిలుపు
రాజమహేంద్రవరం, జనవరి 2 : స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో మరింత ముందుండాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్ధానిక 42 వ డివిజన్‌ మున్సిపల్‌ కమ్యూనిటీ హాలు వద్ద మదర్‌ థెరిస్సా సేవా సమితి వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గోరంట్ల, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, సీసీసి ఎండి పంతం కొండలరావు, కార్పొరేటర్లు మళ్ళ నాగలక్ష్మీ, పెనుగొండ విజయభారతి పాల్గొన్నారు. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15 వ వసంతంలోకి అడుగుపెడుతున్న  ఈ సమితి నిర్వాహకులు కంచిపాటి గోవింద్‌ను ఈ సందర్భంగా అభినందించారు. మదర్‌ థెరిస్సా సేవా స్ఫూర్తిని  ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఆమె పేరుతోనే సమితిని ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు. ఈ సందర్భంగా గోరంట్లను, గన్ని కృష్ణను సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, మళ్ళ వెంకట్రాజు, ఎస్‌ఏ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు విందు ఏర్పాటు చేశారు.