జన్మభూమి గ్రామసభల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి 

0
84
రాజమహేంద్రవరం, జనవరి 2 : ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు  చేపట్టారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 3,7,50,2,4 డివిజన్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల 500 ఫించన్లను మంజూరు చేశారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2018 నాటికి అర్హులైన వారందరికి పక్కా ఇళ్ళను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.