మౌళిక సదుపాయల కల్పనతోనే అభివృద్ధి : గుత్తుల

0
59
రాజమహేంద్రవరం, జనవరి 2 : మౌళిక సదుపాయాల కల్పనతోనే ఏప్రాంతమైన అభివృద్ధి చెందుతుందని 50వ వార్డు కార్పొరేటర్‌, వైఎస్సార్‌సిపి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గుత్తుల మురళీధర్‌ అన్నారు. రోడ్లు, లైట్లు, మంచినీటి సరపఱా, డ్రైన్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ధానిక 50వ డివిజన్‌లోని లాలాచెరువు మున్సిపల్‌ హైస్కూల్‌లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి గుత్తుల అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకోవాలనానరు. చంద్రబాబు అమలు చేస్తున్న పధకాలను వివరించారు. కొత్తగా 259 రేషన్‌ కార్డులు మంజూరు అయ్యాయని, వీలిలో 86 కార్డులు వచ్చాయని వాటిని లబ్ధిదారులకు అందజేశారు. విగిలినవి రాగానే లబ్ధిదారులకు అందజేస్తారని గుత్తుల వివరించారు. పింఛన్లు వచ్చే ఫిబ్రవరిలో ఇస్తామన్నారు. అభయహస్తం స్ల్కాలర్‌షిప్‌ ఒకటి అందజేశారు. 79 డ్వాక్రా గ్రపులలో 61 గ్రూపులకు 30వేలు చొప్పున అందజేశారు. కొత్తగ్రూపులకు పదివేల చొప్పున అందించారు. వాంబేగృహాల సముదాయానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని గుత్తుల కోరారు. వార్డు సమస్యలపై జన్మభూమి హేబిటేషన్‌ ఆఫీసర్‌ ఇఇ సత్యకుమారికి వినతిపత్రం అందజేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు మరుకుర్తి రవియాదవ్‌, కాశి నవీన్‌కుమార్‌, ఆనం చిన్న తదితరులు పాల్గొన్నారు.