సామాజిక సేవా కార్యక్రమాలకు ఓఎన్‌జీసి చేయూత 

0
89
రాజమహేంద్రవరం, జనవరి 2 :  సామాజిక ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఓఎన్‌జీసీ కృష్ణా గోదావరి బేసిన్‌ నేతృత్వంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని సుమారు 25 పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన, ఆర్వో ప్లాంట్‌ల స్థాపనకు రూ. 45 లక్షలను అందజేశారు. లాలాచెరువు వద్ద ఉన్న బేస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో కృష్ణా గోదావరి బేసిన్‌ జీఎం -హెడ్‌ ఫార్వర్డ్‌ బేస్‌ ఏవీవీఎస్‌ కామరాజు చేతుల మీదుగా దీనికి సంబంధించిన చెక్కులను నగరంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం బి.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు.