క్రీడలను ప్రొత్సహించాలి : శివరాముడు

0
88
రాజమహేంద్రవరం, జనవరి  2 : క్రీడలను ప్రొత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన అంశాల పై ప్రతిపాదనలు వేగవంతం చేయాలని ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. 50వ వార్డులో సోమవారం అజ్జరపు లక్ష్మీసుందర రావు క్రికెట్‌ టోర్నమెంట్‌ – 2017ను శివరాముడు,  డిఫ్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు ప్రారంభించారు. తొలిమ్యాచ్‌ పొలిటికల్‌, ప్రెస్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌గా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ జట్టు బౌలింగ్‌ చేపట్టింది. 8 వికెట్ల నష్టానికి 116 పరుగులు 12 ఓవర్లలో పొలిటికల్‌ జట్టు చేసింది. ప్రెస్‌క్లబ్‌ జట్టు 12 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు మాట్లాడుతూ మధర్‌ థెరిస్సా మిలీనియం యూత్‌, తన తల్లిదండ్రులు లక్ష్మీసుందరరావుల పేరిట టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని, 30 టీమ్‌లు పాల్గొనాయని, 12 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. సంధ్య పేపర్‌ రిపోర్టర్‌ ఎన్‌. శ్రీనివాసరావు (ఎన్‌ఎస్‌) పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. స్వర్ణాంధ్ర డా|| గుబ్బల రాంబాబు, కార్పొరేటర్‌ నండూరి వెంకటరమణ, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మానే దొరబాబు, టిడిపి 50వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌, మరుకుర్తి రవియాదవ్‌, అగురు ధనరాజ్‌, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, బొచ్చా రమణ, గారా చంటిబాబు, యువ నాయకులు జక్కంపూడి గణేష్‌, పోలేపల్లి నాగేశ్వరరావు, ఆనం చిన్న, తదితరులు పాల్గొన్నారు.