కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం

0
109
రాజమహేంద్రవరం, జనవరి 3 :కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం సాధ్యమవుతుందని మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడి ్డ అప్పారావు అన్నారు. ఈరోజు 11 నుంచి 15, 22 నుంచి 25 వరకు డివిజన్లలో జరిగిన జన్మభూమి- మావూరు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం,అభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి గ్రామ సభల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.  ఆరోగ్య బీమా పథకాన్ని పేదలు వినియోగించుకో వాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.