ఆటో ఫైనాన్షియర్ల కొత్త కార్యవర్గం 

0
44
రాజమహేంద్రవరం, జనవరి 3 :  ఆటో ఫైనాన్షియర్ల అసోషియేషన్‌ వార్షికోత్సవం నిన్న పేపర్‌మిల్లు ఎదుట ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షుడు టి.కె.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారునిగా కటిక కుమారస్వామి, వి.రామలింగయ్య, అధ్యక్షునిగా ఉల్లంకల రవి, ఉపాధ్యక్షునిగా పి.చంద్రమౌళీ తదితరులు ఎన్నికయ్యారు.