తండ్రికి తగ్గ తనయుడు లోకేష్‌

0
59
రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ : జన్మభూమిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, జనవరి 3 : విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేస్తుండగా తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టిసారించి కొత్త పథకాలకు, కార్యకర్తల సంక్షేమానికి కృషిచేస్తున్నారని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఈరోజు 11, 13, 15, 25, 12, 14, 24, 29 డివిజన్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని, డివిజన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ జన్మభూమి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు, రాష్ట్రాభివృద్ధికి సీఎం చేస్తున్న అభివృద్ధికి తిరుగు లేదన్నారు. మరో 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటారన్నారు.