నగరంలో థీమాటిక్‌ డ్రైవ్‌ 

0
67
రాజమహేంద్రవరం, జనవరి 4 :  స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో భాగంగా జరిగే థీమాటిక్‌ డ్రైవ్స్‌లో భాగంగా నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు పర్యవేక్షణలో మత సంబంధమైన సంస్ధలైన దేవాలయాలు, మసీదులు, చర్చిలను పరిశుభ్రం చేశారు. ఆరవ డివిజన్‌లోని బైపాస్‌ రోడ్డులో చర్చి, ఏడవ డివిజన్‌లోని  దానవాయిపేట మసీదు, 21 వ డివిజన్‌లోని విశ్వేశ్వరస్వామి, 22 వ డివిజన్‌లోని మార్కండేయేశ్వర స్వామి దేవాలయాల పరిసరాలను పరిశుభ్రపర్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లోని అంశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో సహకరించారు. ఆయా మతపరమైన  సంస్థలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు స్వచ్ఛసర్వేక్షణ్‌ 2017 గురించి అవగాహనకై ఆయా సంస్ధల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ జి.శ్రీనివాసరావు, ఆరోగ్యశాఖాధికారి డా.ఎంవిఆర్‌ మూర్తి,  శానిటరీ సూపర్వైజర్లు జి.నారాయణరావు, ఐ.శ్రీనివాస్‌, శానిటరీ ఇనస్పెక్టర్లు కె.రజనీ దేవి. పిఎల్‌ గణపతికుమార్‌, కె.అన్నవరం పాల్గొన్నారు.