ఎల్‌ఐసి ప్రీమియంపై సర్వీసు టాక్స్‌ రద్దు చేయాలి

0
57
ఘనంగా ఎల్‌ఐసి ఏజెంట్ల అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు
రాజమహేంద్రవరం, జనవరి 4 : ఎల్‌ఐసి ప్రీమియంపై సర్వీసు టాక్స్‌ రద్దు చేయాలని, పాలసీదారులకు పాలసీలపై బోనస్‌ పెంచాలని ఎల్‌ఐఏఎఫ్‌ఐ అధ్యక్షులు రణవీర్‌శర్మ డిమాండ్‌ చేశారు. రాజమండ్రి డివిజనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎల్‌ఐజి ఏజెంట్స్‌ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఈరోజు జె.ఎన్‌.రోడ్‌లోని ఎస్‌.వి.ఫంక్షన్‌ హాలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రణవీర్‌శర్మ, ఉపాధ్యక్షులు కె.బి.ఎస్‌.శాస్త్రి, ప్రధాన కార్యదర్శి ఎన్‌.గజపతిరావు, కోశాధికారి పి.ఎస్‌.ఎన్‌.మూర్తి మాట్లాడారు. పాలసీదారులకు రుణాలపై వడ్డీ, లేటు ఫీజు తగ్గించాలని, పాలసీదారులకు ప్రత్యేక సిట్టింగ్‌, వెయిటింగ్‌ రూమ్‌లు ఇవ్వాలని, ఐఆర్‌డిఏ సిఫార్సు చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కమిషన్‌ రేట్లను అమలుపరచాలని, ఏజెంట్లకు  వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఏజెంట్లకు గ్రాట్యుటీ పది లక్షల వరకు పెంచాలని, అందరికీ ఐడి కార్డులు ఇవ్వాలని సూచించారు. తమ అసోసియేషన్‌ ద్వారా ఎన్నో విజయాలు సాధించామని, భవిష్యత్తులో అందరూ సంఘటితంగా ఉంటే మిగిలిన డిమాండ్లను నెరవేర్చుకోగలుగుతామని చెప్పారు. డివిజనల్‌ కార్యదర్శి కొప్పిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఆడంబరాలకు, స్వలాభాపేక్షలకు దూరంగా ఉండి సేవలందించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్‌ అధ్యక్షులు ఎన్‌.బాబూరావు, మస్తాన్‌, బి.మార్కండేయులు, పి.రమేష్‌బాబు, కె.లీలావతి, కె.అరవింద్‌, జె.రంగారావు, ఇఏ విశ్వరూప్‌, బి.తిరుమలరావు, డి.శివకుమార్‌, పి.నాగేశ్వరరావు, ఎస్‌.రాంబాబు, కె.వెంకటరెడ్డి, వి.ఈశ్వర కుమారస్వామి, వి.వి.సుబ్బారావు, కె.వేణుగోపాలరెడ్డి, పి.వి.ఎస్‌.కృష్ణారావు,  కళ్యాణ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. అనంతరం 20 బ్రాంచీలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులను సత్కరించారు.