రేపు స్వర్ణాంధ్ర ఆత్మీయ సేవా పురస్కారాలు ప్రదానం

0
68
రాజమహేంద్రవరం,  జనవరి  5 : గత రెండు దశాబ్ధాలుగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ 19వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. స్థానిక లాలా చెరువు వృద్ధాశ్రమ భవనంలోని సుమన్‌ కళావేదికలో శుక్రవారం జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పలువురు నగర ప్రముఖులు పాల్గొంటారని స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మీయ సేవా పురస్కారాలు 2017ను వివిధ రంగాల్లో నిష్ణాలతులైన సభ్యులకు అందిస్తామన్నారు. ఇప్పటికే వృద్ధాశ్రమం మహిళల ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం, ఉచిత ట్యూషన్‌ సెంటర్‌, రక్తదాన శిబారలు, ఉచిత వైద్య శిబిరాలతో పాటు పేద ప్రజలకు ఉపయోగపడే దస్తులు సేకరణ పంపిణీ కార్యక్రమాలతో పాటు కొత్తగా షీడ్రైవ్‌ పేరున ఆడపిల్లలకు ఉచితంగా డ్రైవింగ్‌ శిక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ గుబ్బల రాంబాబు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైకాపా సిటీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ,  డిఎస్పీ వాసంశెట్టి రాజగోపాల్‌ హాజరవుతారన్నారు.