సమస్యల పరిష్కారానికి కృషి

0
41
గడపగడపకు వైకాపాలో ఆకుల వీర్రాజు 
 
రాజమహేంద్రవరం, జనవరి 6 : రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధి బొమ్మూరులో రాజమహేంద్రవరం రూరల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు గడపగడపకు వైస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి స్థానిక సమస్యలను తెలుసుకుంటూ కొనసాగించారు.  కార్యక్రమంలో పలువురు మహిళలు వారి ఆవేదన వ్యక్తంచేశారు. వర్షా కాలం కాకపోయినా రోడ్ల పై నీరు నిలిచి అంటురోగాల భారిన పడుతున్నారన్నారని శివనగర్‌ చివరి విధి వాస్తవ్యులు రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వనపల్లి అచుతా వేణి గృహరుణం కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నాము కానీ అధికారులనుండి ఈపాటికి గృహస్థలం కానీ గృహరుణం కానీ మంజూరు కాలేదని వీర్రాజుకి విన్నవించుకుంది. శివనగర్‌ చివరి వాసులు శ్రీనివాస్‌  డ్రైన్లు లేకపోవడం వలన రోడ్ల పై మురుగు పారుతుంది దానివల్ల  వీధిలోనికి రాలేని పరిస్థితని ఆకుల వీర్రాజు దృష్టికి తీసుకువచ్చారు. ఆకుల వీర్రాజు వెంటనే  స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యానుమాల త్యాగరాజు, కేవీ సుబారెడ్డి, నాయణాల వెంకట స్వామి నాయుడు అను,తోడేటి రాజా ,దులం సూర్యారావు, మాట్టా నగన్న, శ్రీపతి చంట, అంబటి శ్రీను, బిధం రాజు, నూనె బలరాం, సుంకర చిరంజీవి, సత్యనారాయణ, ఆజిర్‌ నాయుడు, సుశిలా, రాణి, తాటికొండ విష్ణు మూర్తి, కేదారినాధ్‌, జనపరెడ్డి బాబీ  తదితరులు ఆకుల వీర్రాజు వెంట ఉన్నారు.