10 నుంచి టి-20 క్రికెట్‌ టోర్నమెంట్‌

0
75
రాజమహేంద్రవరం, జనవరి 7 : ఆర్ట్స్‌కళాశాల మైదానంలో ఈనెల 10 నుంచి 16వ తేదీవరకు టీ-20 చాలెంజర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు రాజమండ్రి సిటీ క్రికెట్‌ క్లబ్‌ ప్రతినిధి డాక్టర్‌ ఫణీంద్ర చెప్పారు. ఈరోజు ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్దతిలో జరిగే ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయన్నారు. విన్నర్స్‌కు రూ.25వేలు, రన్నర్స్‌కు రూ 12,500నగదు బహుమతిగా అందచేస్తామన్నారు. ముగింపు వేడుకలకు అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారుడు వై.వేణుగోపాలరావు హాజరవుతారన్నారు. ఆడిటర్‌ వి.భాస్కరరామ్‌ సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్‌ టీం సభ్యులకు రంగుల దుస్తులు, ఎల్‌ఇడి స్టంప్స్‌ అందిస్తున్నట్టు  తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అంపైర్లను తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. నగరానికి చెందిన రాజా వారియర్స్‌, ఫ్రెండ్స్‌-11, చారి ఛాలెంజర్స్‌, రైజింగ్‌ రైడర్స్‌, స్పా టర్న్‌ రెప్స్‌, పిఆర్‌ పాంతర్స్‌, రాజమహేంద్రవరం రాయల్స్‌ క్రికెట్‌ క్లబ్‌, సుభాని స్టాల్స్‌ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో చారి, సిహెచ్‌.సీతారామరాజు, ఎం.వి.ఎస్‌.చౌదరి, రామరాజువర్మ, వాసు, జాని, శేఖర్‌, జిలాని, శివాజీ తదితరులు పాల్గొన్నారు.