బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా క్రొవ్విడి

0
68
రాజమహేంద్రవరం, జనవరి 7 : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఓబిసి మోర్చ ప్రధాన కార్యదర్శిగా నగరానికి చెందిన క్రొవ్విడి సురేష్‌ నియమితులయ్యారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణకు ప్రధాన అనుచరుడైన సురేష్‌ ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు జల్లి మధుసూధన్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. క్రొవ్విడిని బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, నాళం పద్మశ్రీ, ఆకాశపు మురళి, పాటంశెట్టి అయ్యా, కొరిపెల్ల వంశీ మోహన్‌, కొప్పిశెట్టి లోవరాజు, బండారు జపాన్‌, అయ్యల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.