ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష,కార్యదర్శులుగా కిరణ్‌కుమార్‌ రాజు, లింకన్‌

0
87
 రాజమహేంద్రవరం, జనవరి 9 : ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షునిగా కనుమూరి కిరణ్‌కుమార్‌ రాజు, కార్యదర్శి డీఎ లింకన్‌ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో రెండు ప్యానెళ్ళ మధ్య పోటీ జరగగా ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో రాజు, లింకన్‌ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు నమ్మి శ్రీనివాస్‌ (ఎన్‌ ఎస్‌), దీక్షితుల సుబ్రహ్మణ్యం, కోశాధికారి బి. హరికృష్ణ, సంయుక్త  కార్యదర్శులుగా కర్రి శ్యామ్‌ శేఖరరెడ్డి, సోమాబత్తుల కృపానందం, కార్యవర్గసభ్యులుగా  ఎర్రా కృష్ణకుమార్‌, చేబోలు రాజు, జి.రామకృష్ణ, ఎన్‌.సాయిరామ్‌, ఆర్‌వివి సత్యనారాయణ, మురారి శ్రీనివాస్‌,  పాము వీర వెంకట వరప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా పెద్దాడ నవీన్‌, సభ్యులుగా జీఎ భూషణ్‌బాబు, రెహ్మాన్‌ వ్యవహరించారు.